CM Revanth Reddy Meets Jithender Reddy: బీజేపీ నేత జితేందర్‌ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్‌ రెడ్డి, నాకు సీటు రాలేదని ఓదర్చాడానికే వచ్చాడని తెలిపిన బీజేపీ నేత

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల వేళ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ సీనియర్‌ నేత జితేందర్‌ ఇంటికి వెళ్లారు.రానున్న లోక్‌సభ ఎన్నికల్లో జితేందర్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌ ఎంపీ స్థానం ఆశించగా హైకమాండ్ తేందర్‌ రెడ్డిని కాదని డీకే అరుణకు అవకాశం కల్పించింది.

CM Revanth Reddy visits BJP leader Jitender Reddy's house Watch Videos

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల వేళ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ సీనియర్‌ నేత జితేందర్‌ ఇంటికి వెళ్లారు.రానున్న లోక్‌సభ ఎన్నికల్లో జితేందర్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌ ఎంపీ స్థానం ఆశించగా హైకమాండ్ తేందర్‌ రెడ్డిని కాదని డీకే అరుణకు అవకాశం కల్పించింది.ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్‌ ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి ఉన్నారు.

ఈ సందర్భంగా జితేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌ మా ఇంటికి రావడం కొత్తేమీ కాదు. తన అన్న ఇంటికి వచ్చాడు అంతే. మాది ఒక్కటే జిల్లా. నాకు సీటు రాలేదని ఓదర్చాడానికే వచ్చాడు. నేను ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నాను. బీజేపీలో సంతోషంగానే ఉన్నాను. నా సీటు గురించి అధిష్టానం చూసుకుటుంది. పార్టీలోకి సీఎం రేవంత్‌ నన్ను ఆహ్వానించలేదు. నేను కూడా ఏమీ మాట్లాడలేదు. కేవలం పరామర్శ కోసమే రేవంత్‌ మా ఇంటికి వచ్చాడు అని అన్నారు. కాంగ్రెస్‌లో టికెట్లు ఫుల్‌ ఫిల్‌ అయ్యాయి. మహబూబ్‌నగర్‌లో వంశీ, చేవెళ్లలో పట్నం మహేందర్‌ రెడ్డి కాంగ్రెస్‌కు ఉన్నారని తెలిపారు.

Here's Video