Telangana Elections 2024: వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య, మిగతా మూడు స్థానాలపై కొనసాగుతున్న ఉత్కంఠ
ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారం కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ వారికి కండువా కప్పి ఆహ్వానించారు.
వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారం కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అంతకుముందు కడియం కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ లోక్‌సభ టికెట్ ఇవ్వగా.. ఆ పార్టీ నుంచి పోటీ చేసే ఉద్దేశం తనకు లేదంటూ ఆమె నిరాకరించారు. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగానూ కాంగ్రెస్ ఇప్పటి వరకు 14 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)