Babu Mohan Resigns BJP: బీజేపీకి అందోల్ మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ రాజీనామా, నా ఫోన్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తడం లేదని ఆవేదన

బీజేపీకి అందోల్ మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మాజీ మంత్రి నటుడు బాబు మోహన్ ప్రెస్ మీట్‌లో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Babu Mohan resigns from BJP (photo-Video Grab)

బీజేపీకి అందోల్ మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మాజీ మంత్రి నటుడు బాబు మోహన్ ప్రెస్ మీట్‌లో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నన్ను బీజేపీలో అవమానిస్తున్నారు. నా ఫోన్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తడం లేదు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లేదు. రేపు రాజీనామ లేఖ పంపుతాను. భవిష్యత్తులో వరంగల్ జిల్లా ఎంపీగా పోటీ చేస్తా’ అని బాబు మోహన్‌ వెల్లడించారు. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన బాబు మోహన్.. మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఇక.. అందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరఫున దామోదరం రాజనరసింహ విజయం సాధించిన విషయం తెలిసిందే.

Here's His Statement

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement