Nagarkurnool MP Ramulu Joins BJP: బీఆర్ఎస్ పార్టీకి షాక్, బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 17 సీట్లు మావేనని తెలిపిన రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్
గురువారం ఢిల్లీ పెద్దల సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారాయన. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి చంద్రశేఖర్, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు.
తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీని వీడిన నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఢిల్లీ పెద్దల సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారాయన. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి చంద్రశేఖర్, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు.రాములు చేరికను స్వాగతించిన రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్.. తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా మారుతోందన్నారు.
తెలంగాణలో బీఆర్‌ఎస్ మునిగిపోయిన నావ.. కారు రిపేర్ అయ్యే పరిస్థితి లేదన్నారు. పార్లమెంట్‌ఎన్నికల్లో బీజేపీదే గెలుపు. మొత్తం 17 స్థానాలు మేమే గెలుస్తాం. బీజేపీ అన్ని పార్టీల కంటే ప్రచారంలో ముందుగా దూసుకుపోతోంది. ప్రధాని మోదీ కూడా రెండ్రోజులు తెలంగాణలో పర్యటిస్తారు. తెలంగాణ అన్ని లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయం అని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)