Telangana: ప్రమాణస్వీకారం చేసిన తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు, రాజ్యసభ సమావేశాల దృష్ట్యా బండా ప్రకాశ్ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరు
కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, పీ వెంకట్రామిరెడ్డితో శాసన మండలిలోని తన చాంబర్‌లో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. కాగా, రాజ్యసభ సమావేశాల దృష్ట్యా బండా ప్రకాశ్ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు.
తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా (MLC) ఎన్నికైన ఐదుగురు టీఆర్‌ఎస్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, పీ వెంకట్రామిరెడ్డితో శాసన మండలిలోని తన చాంబర్‌లో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. కాగా, రాజ్యసభ సమావేశాల దృష్ట్యా బండా ప్రకాశ్ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యే కోటాలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ మాట ఇస్తే తప్పరన్నారు. హుజూరాబాద్ ప్రజలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. మొరిగే కుక్కలకు తన పదవే సమాధానమని చెప్పారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)