Telangana: రేవంత్ రెడ్డి సర్కారు మరో కీలక నిర్ణయం, తెలంగాణలో కొత్త హైకోర్టు కోసం బుద్వేల్ పరిధిలో 100 ఎకరాలు కేటాయింపు, జీవో ఇదిగో..
తెలంగాణలో నిర్మించబోయే కొత్త హైకోర్టు కోసం 100 ఎకరాల భూమిని కేటాయించింది రేవంత్ రెడ్డి సర్కారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నాం తెలంగాణ సర్కార్ (Telangana Government) జీవో జారీ చేసింది.
తెలంగాణలో నిర్మించబోయే కొత్త హైకోర్టు కోసం 100 ఎకరాల భూమిని కేటాయించింది రేవంత్ రెడ్డి సర్కారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నాం తెలంగాణ సర్కార్ (Telangana Government) జీవో జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతి పేట్ , బుద్వేల్ గ్రామం పరిధిలో (Budvel and Rajendranagar) ఉన్న 100 ఎకరాలను హైకోర్టు ప్రాంగణం కోసం కేటాయిస్తున్నట్లు జీవో నెంబర్ 55లో పేర్కొంది.
కిందటి నెలలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ఎంసీహెచ్‌ఆర్‌డీలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కలిశారు. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో.. కొత్తది (construction of a new high court) నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొత్త హైకోర్టు నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. కొత్త భవనం నిర్మాణం జరిగే వరకు హైకోర్టు కార్యకలాపాలు పాత భవనంలోనే జరుగుతాయి.
Here's GO
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)