Telangana: మందుబాబులు విన్నారా ఈ న్యూస్.. తెలంగాణలో క్వార్టర్ లిక్కర్‌పై రూ.20.. బీరుపై రూ. 10 పెరిగింది, నేటి నుంచి కొత్త ధరలు అమల్లోకి
ఆర్డినరీ, మీడియం మద్యం 180 ఎంఎల్ లిక్కర్ (క్వార్టర్) బాటిల్‌పై రూ.20, ప్రీమియం మద్యం క్వార్టర్ బాటిల్‌పై రూ.40 పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో మద్యం ధరలు మరోమారు పెరిగాయి. ఆర్డినరీ, మీడియం మద్యం 180 ఎంఎల్ లిక్కర్ (క్వార్టర్) బాటిల్‌పై రూ.20, ప్రీమియం మద్యం క్వార్టర్ బాటిల్‌పై రూ.40 పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఆర్డినరీ, మీడియం మద్యం 375 ఎంఎల్ (హాఫ్) బాటిల్‌పై రూ. 40, 750 ఎంఎల్ (ఫుల్) బాటిల్‌పై రూ.80 చొప్పున.. ప్రీమియం మద్యం హాఫ్ బాటిల్‌పై రూ.80, ఫుల్ బాటిల్‌పై రూ.160 చొప్పున పెంచింది. లిక్కర్‌తో పాటు వైన్, బీర్ల ధరలు కూడా పెరిగాయి. వైన్ క్వార్టర్ బాటిల్‌పై రూ.10, హాఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 చొప్పున.. ప్రతి బీరుపై రూ.10 చొప్పున రేటు పెరిగింది. ఈ మేరకు బుధవారం ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ శాఖాపరమైన ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన రేట్లు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)