Konda Surekha Injured: రాహుల్ గాంధీ బైక్ ర్యాలీలో అపశృతి, బైక్ నడుపుతూ కింద పడ్డ కొండా సురేఖ, ముఖానికి, చేతికి గాయాలు

కాంగ్రెస్ విజయ భేరి బస్సు యాత్రలో మాజీ మంత్రి కొండా సురేఖకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. భూపాలపల్లిలో బైక్ ర్యాలీలో పాల్గొన్న సురేఖ స్కూటీ నడుపుతూ కిందపడ్డారు. ముఖానికి, చేతికి గాయాలయ్యాయి. వెంటనే ఆమె అనుచరులు హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు

Konda surekha (Photo-Video Grab)

కాంగ్రెస్ విజయ భేరి బస్సు యాత్రలో మాజీ మంత్రి కొండా సురేఖకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. భూపాలపల్లిలో బైక్ ర్యాలీలో పాల్గొన్న సురేఖ స్కూటీ నడుపుతూ కిందపడ్డారు. ముఖానికి, చేతికి గాయాలయ్యాయి. వెంటనే ఆమె అనుచరులు హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో సురేఖ చికిత్స పొందుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి పట్టణంలో కాంగ్రెస్‌ నేతలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. భూపాలపల్లి పట్టణంలోని బాంబుల గడ్డ వరకు నిరుద్యోగులతో కలిసి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ ర్యాలీకి తరలివచ్చారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement