KTR Fell Down Video: వీడియో ఇదిగో, ప్రచార వాహనంపై నుంచి కిందపడిన మంత్రి కేటీఆర్, ఎంపీ సురేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి, కేటీఆర్‌కు స్వల్ప గాయాలు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార ర్యాలీలో గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గులాబీ శ్రేణులు ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయల్దేరారు. కేటీఆర్, ఇతర నేతలు ప్రచార వాహనంపై వెళ్లారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార ర్యాలీలో గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గులాబీ శ్రేణులు ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయల్దేరారు. కేటీఆర్, ఇతర నేతలు ప్రచార వాహనంపై వెళ్లారు. ఈ క్రమంలో వాహన డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో కేటీఆర్, ఎంపీ సురేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి కిందపడిపోయారు. సడన్ బ్రేక్‌తో వాహన రెయిలింగ్ ఊడిపోవడంతో వారంతా కిందపడ్డారు. వెంటనే అప్రమత్తమైన కేటీఆర్ భద్రతా సిబ్బంది ఆయనను పట్టుకున్నారు.
ఈ ప్రమాదంలో కేటీఆర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆర్మూర్ పట్టణంలోని పాత ఆలూర్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎవరికీ ఏం కాకపోవడంతో జీవన్‌రెడ్డితో పాటు కేటీఆర్ నామినేషన్ కేంద్రానికి వెళ్లారు.ఘటనపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. నా ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందవద్దు’’ అని వెల్లడించారు. అనంతరం కొడంగల్ రోడ్ షోలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)