Telangana: ప్రకాష్ రాజ్ దత్తత తీసుకున్న గ్రామం ఎలా ఉందో చూశారా, ట్విట్టర్లో ఫోటోలు షేర్ చేసి అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకున్న గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్యతో కలిసి గొప్ప పురోగతిని సాధించారని కేటీఆర్ కొనియాడారు
మంత్రి కేటీఆర్ సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకున్న గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్యతో కలిసి గొప్ప పురోగతిని సాధించారని కేటీఆర్ కొనియాడారు. ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకున్న గ్రామంలో జరిగిన అభివృద్ధికి సంబంధించిన ఫోటోలను మధుసూదన్ రావు అనే వ్యక్తి కేటీఆర్‌కు ట్యాగ్ చేయగా, ఆయన స్పందించారు.కాగా 2015, సెప్టెంబర్‌లో షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)