Telangana MLC Elections 2024: తెలంగాణ ఎమ్మెల్సీలుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఏకగ్రీవం, ప్రకటించిన అసెంబ్లీ కార్యాలయం
రెండు ఎమ్మెల్సీ స్ధానాలకు రెండు నామినేషన్‌లు మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌కు ఉపసంహరణ గడువు నేటితో(మంగళవారం) ముగిసింది. రెండు ఎమ్మెల్సీ స్ధానాలకు రెండు నామినేషన్‌లు మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఎన్నికలు లేకుండానే కాంగ్రెస్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యాలయం ప్రకటించింది. కాసేపట్లో అసెంబ్లీ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఎమ్మెల్సీ సర్టిఫికెట్లను మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ అందుకోనున్నారు.
Here's Congress Tweet
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)