Telangana: వారి చావుకు కారణం ఆ రిపోర్టర్లు రూ. 25 లక్షలు బ్లాక్ మెయిల్ చేయడమే, ముగ్గురు కొడుకులను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి కేసులో వివరాలను వెల్లడించిన పోలీసులు

అనంతరం తాను బలవన్మరణానికి పాల్పడిన సంగతి విదితమే. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు.

Telangana police Revealed details of the incident of Father killing three sons and committing suicide in Tangutur village

రంగారెడ్డి జిల్లా టంగటూరు గ్రామంలో నీరటి రవి(35) అనే ప్రైవేట్ ఉద్యోగి తన ముగ్గురు కుమారులు సాయికిరణ్(13), మోహిత్ కుమార్(10), ఉదయ్ కిరణ్(7) లను చంపేసి.. అనంతరం తాను బలవన్మరణానికి పాల్పడిన సంగతి విదితమే. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. మృతుడు నీరటి రవి భార్య శ్రీలత ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేయగా నీరటి రవి అనే వ్యక్తిని ఐదుగురు రిపోర్టర్లు ఒక హోమ్ గార్డ్ 25 లక్షలు కావాలని బెదిరించి డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేయగా తన ముగ్గురు కొడుకులను చంపి తాను కూడా ఉరి వేసుకున్నాడని తెలిపారు. నలుగురి మృతికి కారకులైన వారిని పోలీసులు గుర్తించగా వీరిలో ఐదుగురు విలేఖరులు కాగా . ఒక హోం గార్డు. ఇతరులు ఉన్నారు. గొలుసుకట్టు స్కాంలో చిక్కుకున్న రవి.. అప్పులు ఇచ్చిన జనం ఇంటికి రావడంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)