Telangana Shocker: పుస్తకాలకు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని బాలుడు ఆత్మ‌హ‌త్య, త‌న ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్

పుస్త‌కాల‌కు డబ్బులు ఇవ్వ‌లేద‌ని ఓ బాలుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. బెండ‌ల‌పాడు గ్రామానికి చెందిన సుధీర్ బాబు(11) పుస్త‌కాల కోసం త‌న త‌ల్లిదండ్రుల‌ను డ‌బ్బులు అడిగాడు.

Suicide (Photo Credits: Twitter)

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా చంద్రుగొండ మండ‌లం బెండ‌ల‌పాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పుస్త‌కాల‌కు డబ్బులు ఇవ్వ‌లేద‌ని ఓ బాలుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. బెండ‌ల‌పాడు గ్రామానికి చెందిన సుధీర్ బాబు(11) పుస్త‌కాల కోసం త‌న త‌ల్లిదండ్రుల‌ను డ‌బ్బులు అడిగాడు. పుస్త‌కాలు కొనేందుకు పేరెంట్స్ డ‌బ్బులు ఇవ్వ‌క‌పోవ‌డంతో.. సుధీర్ బాబు తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు. దీంతో సుధీర్ త‌న ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు