Telangana Shocker: హైదరాబాద్‌లో పాప మిస్సింగ్, జహీరాబాద్ బస్టాండ్‌లో కిడ్నాప్ చేసిన మహిళను పట్టుకుని చిన్నారిని కాపాడిన పోలీసులు, వీడియో ఇదిగో..

పాతబస్తీలోని మాదన్నపేటలో పాపను కిడ్నాప్‌ చేశారు. ఓ మహిళ పాపను కిడ్నాప్‌ చేసి చంచల్ గూడ నుండి ఎంజీబీఎస్‌వైపు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.

9 Months old baby kidnapped by caretaker from Hyderabad and rescued in Zaheerabad Watch Video

హైదరాబాద్ పాతబస్తీ మాదన్నపేటలో కిడ్నాప్‌నకు గురైన తొమ్మిది నెలల పాపను జహీరాబాద్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. పాతబస్తీలోని మాదన్నపేటలో పాపను కిడ్నాప్‌ చేశారు. ఓ మహిళ పాపను కిడ్నాప్‌ చేసి చంచల్ గూడ నుండి ఎంజీబీఎస్‌వైపు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అనంతరం.. జహీరాబాద్‌ వెళ్లే బస్సు ఎక్కినట్టు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు.

అయితే, కిడ్నాప్‌ చేసిన మహిళను సహనాజ్‌ఖాన్‌గా గుర్తించారు. బాధితుల ఇంట్లో ఆమె రెండు నెలల క్రితమే పని మనిషిగా చేరినట్టు తెలుస్తోంది. జహీరాబాద్ పోలీసులను మాదన్నపేట్ పోలీసులు అప్రమత్తం చేశారు. కిడ్నాపర్‌ మహిళ జహీరాబాద్‌లో బస్సు దిగిన వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని చిన్నారిని క్షేమంగా కాపాడారు. పాపను పేరెంట్స్‌కు అప్పగించారు. విశాఖలో దారుణం, రూ. 15 లక్షల కెమెరా కోసం యువకుడిని కిరాతకంగా హత్య చేసిన ఇద్దరు వ్యక్తులు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)