Telangana Shocker: గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్‌పై హత్యాయత్నం, సుపారీ గ్యాంగ్‌కు రూ. 50 లక్షలు ఇచ్చి భారీ స్కెచ్, తృటిలో తప్పించుకున్న కాంతారావు
కోదాడలో గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్‌పై హత్యాయత్నం జరిగింది. కాంతారావు హత్య కోసం రూ.50 లక్షలు ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్‌తో కాలేజ్ భాగస్వాములు ఒప్పందం చేసుకున్నారు.
Attempt Murder on Gate Engineering College Owner: కోదాడలో గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్‌పై హత్యాయత్నం జరిగింది. కాంతారావు హత్య కోసం రూ.50 లక్షలు ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్‌తో కాలేజ్ భాగస్వాములు ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో సుపారీ గ్యాంగ్‌కు ముందుగా రూ.5లక్షలు కూడా చెల్లించారు. దీంతో, కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎం వ్యాన్‌తో ఢీకొట్టాలని ప్లాన్ చేసుకున్నారు.
మునగాల మండలం మద్దెలచెరువు వద్ద కారును ఢీకొట్టేందుకు ప్రయత్నం చేశారు. అయితే, సుపారీ గ్యాంగ్ నుంచి కాంతారావు తప్పించుకుని వెళ్లిపోయారు. కాగా, సుపారీ గ్యాంగ్.. కోదాడలో కాంతారావు కారును డీసీఎంతో ఢీకొట్టడంతో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ క్రమంలో తేరుకున్న కాంతారావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. 12 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)