TRS Activists Attack KA Paul: రైతు కుటుంబాల పరామర్శకు వెళ్లిన కేఏ పాల్‌పై టీఆర్ఎస్ కార్యకర్త దాడి, తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేసిన ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు

ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్‌పై దాడి జరిగింది. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్తుండగా ఓ టీఆర్‌ఎస్‌ కార్యకర్త దాడి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని బస్వాపూర్‌ గ్రామ రైతులను పరామర్శించేందుకు సోమవారం హైదరాబాద్‌ నుంచి పాల్‌ బయలుదేరారు.

TRS Activists Attack KA Paul

ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్‌పై దాడి జరిగింది. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్తుండగా ఓ టీఆర్‌ఎస్‌ కార్యకర్త దాడి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని బస్వాపూర్‌ గ్రామ రైతులను పరామర్శించేందుకు సోమవారం హైదరాబాద్‌ నుంచి పాల్‌ బయలుదేరారు. విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు పెద్ద ఎత్తున సిరిసిల్ల సరిహద్దుకు చేరుకున్నారు. ఆ సమయంలో మీడియాతో పాల్‌ మాట్లాడుతుండగా జిల్లెల్ల గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త అనిల్‌కుమార్‌ దాడి చేశాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఈ దాడితో జక్కాపూర్‌ రోడ్డుపై పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ సమస్య ఎదురైంది. పోలీసులు బందోబస్తు మధ్య పాల్‌ను వెనక్కి పంపారు. సిద్దిపేట పట్టణంలో పాల్‌ మాట్లాడుతూ.. పోలీసులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు. రైతు కుటుంబాలను పరామర్శిస్తే తప్పేంటని నిలదీశారు. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి శిక్షించాలన్నారు. ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పాల్‌పై దాడిని ఖండిస్తూ బస్వాపూర్‌ గ్రామస్తులు నిరసన తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now