TSRTC: హైదరాబాద్‌లో కొత్తగా 22 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి, ఆధార్ కార్డు చూపిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వీడియోలు ఇవిగో..
టీఎస్‌ఆర్టీసీ (TSRTC)లో కొత్తగా 22 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు.
టీఎస్‌ఆర్టీసీ (TSRTC)లో కొత్తగా 22 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు. గతంలో ఆర్టీసీ (TSRTC) సిబ్బంది జీతాల కోసం ఇబ్బంది పడేవారని.. ఆర్టీసీ ఆస్తులను కోల్పోతుందనే ఆందోళన ఉండేదన్నారు. ఆర్టీసీ కార్మికులకు భావ ప్రకటన స్వేచ్చ ఉండేది కాదన్నారు. రాష్ట్రంలో సింగరేణి, ఆర్టీసీ సంస్థల్లోనే వేల సంఖ్యలో ఉద్యోగులు ఉంటారని డిప్యూటీ సీఎం అన్నారు. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ అధ్యక్షతన భేటీ.. ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు ఉండొచ్చని అంచనాలు
అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్న మొత్తం 500 బస్సులు ఆగస్టు నాటికి రానున్నాయి. ఇవన్నీ నాన్ ఏసీ బస్సులే. ఈ బస్సుల్లోనూ మహిళలు ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు.ఛార్జింగ్ కోసం బీహెచ్‌ఈఎల్, మియాపూర్, కంటోన్మెంట్, హెచ్‌సీయూ, రాణిగంజ్ డిపోల్లో 33 కేవీ పవర్ లైన్లు తీసుకున్నారు. ఆర్టీసీ సొంతంగా 565 డీజిల్ బస్సులు సమకూర్చుకుంటోంది. ఇందులో 125 మెట్రో డీలక్స్‌లుంటాయి. ఇవన్నీ జూన్‌లో అందుబాటులోకి వస్తాయి. మరో 440 బస్సుల్లో 300 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు కాగా 140 ఆర్డినరీ బస్సులు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)