YS Sharmila: అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన షర్మిల, ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసి బలవంతంగా అపోలో ఆస్పత్రికి తరలించిన పోలీసులు

రెండ్రోజుల చికిత్స అనంతరం వైఎస్ షర్మిల గారు ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు.ప్రజలపక్షాన న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే తనను, తమ పార్టీ కార్యకర్తలను బందీలుగా చేశారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

File (Credits: Twitter/ANI)

వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి, బలవంతంగా అపోలో ఆస్పత్రికి తరలించగా.. రెండ్రోజుల చికిత్స అనంతరం వైఎస్ షర్మిల గారు ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు.ప్రజలపక్షాన న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే తనను, తమ పార్టీ కార్యకర్తలను బందీలుగా చేశారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

వైఎస్సార్‌ బిడ్డను పంజరంలో పెట్టి బంధించవచ్చని కేసీఆర్‌ అనుకుంటున్నారు. అది ఆయన తరం కాదు’అని స్పష్టం చేశారు. తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా కేసీఆర్‌ పోలీసుల భుజాన తుపాకీ పెట్టి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కోర్టు ఆదేశాలంటే గౌరవంలేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రకు అనుమతివ్వాలని కోరిన కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారని మండిపడ్డారు.

Here's YSRTP Tweet