Telangana: ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు బయలుదేరిన షర్మిల భర్త అనిల్ కుమార్, పాదయాత్ర చేయడం తప్పా?,నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని వెల్లడి

రాజ్‌భవన్‌ రోడ్డులో వైఎస్‌ షర్మిలను అడ్డుకుని పోలీసులు అరెస్ట్‌ చేశారు.షర్మిలను అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో ఆమె భర్త అనిల్‌ ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ.. ‘ పాదయాత్ర చేయడం తప్పా?, నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది’ అని తెలిపారు.

YS Sharmila's husband Anil Kumar (Photo-ANI)

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై కేసు నమోదైంది. వీఐపీ రాహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో (Punjagutta police station) కేసు నమోదైంది. 333, 353,337 సెక్షన్ల కింద షర్మిలపై (YSRTP leader YS Sharmila) పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న(సోమవారం) టీఆర్‌ఎస్‌ నేతల దాడిలో (TRS Leaders) ధ్వంసమైన కారును తనే స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు షర్మిల బయలుదేరిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌ రోడ్డులో వైఎస్‌ షర్మిలను అడ్డుకుని పోలీసులు అరెస్ట్‌ చేశారు.షర్మిలను అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో ఆమె భర్త అనిల్‌ ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ.. ‘ పాదయాత్ర చేయడం తప్పా?, నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది’ అని తెలిపారు.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement