Gmail Down: మొరాయించిన జీమెయిల్ సర్వీసులు, ట్వీట్లతో మోతమోగిస్తున్న యూజర్లు, అసలు ఏమైందో చూస్తున్న నిపుణులు

చాలా మంది వినయోగదారులకు జీమెయిల్ ఓపెన్ అవ్వలేదు. మొబైల్ తో పాటూ, డెస్క్ టాప్ వర్షన్‌ లో జీమెయిల్ (Gmail down) కొంతసేపు ఆగిపోయింది. ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ గురించి తెలియజేసే డౌన్ డిటెక్టర్ డాట్ కామ్ (Downdetector.com) ఈ మేరకు ప్రకటన చేసింది.

Gmail (Photo Credits: Gmail)

New Delhi, DEC 10: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే జీమెయిల్‌ (Gmail down) మొరాయించింది. చాలా మంది వినయోగదారులకు జీమెయిల్ ఓపెన్ అవ్వలేదు. మొబైల్ తో పాటూ, డెస్క్ టాప్ వర్షన్‌ లో జీమెయిల్ (Gmail down) కొంతసేపు ఆగిపోయింది. ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ గురించి తెలియజేసే డౌన్ డిటెక్టర్ డాట్ కామ్ (Downdetector.com) ఈ మేరకు ప్రకటన చేసింది. చాలామంది వినియోగదారులు తమ జీమెయిల్ (Gamil) సర్వీసులను ఉపయోగించలేకపోయారని తెలిపింది. అయితే అందరికీ ఈ ఇబ్బంది ఎదురవ్వలేదని, కొంతభాగం వినియోగదారులు మాత్రమే ఈ సమస్యను ఎదుర్కున్నట్లు తెలుస్తోంది. జీమెయిల్ పనిచేయకపోవడంతో చాలామంది యూజర్లు ట్వీట్లు చేశారు. జీమెయిల్ డౌన్ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌తో పోస్టులు చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)