Flipkart Order Gone Wrong: మ్యాక్ బుక్ ఆర్డర్ పెడితే బోట్ స్పీకర్స్ వచ్చాయి, పార్సిల్ ఓపెన్ చేసి ఒక్కసారిగా షాక్ తిన్న స్టూడెంట్, కంపెనీ ఏమి చెప్పిందంటే..
వివరాల్లోకెళితే.. అథర్వ ఖండేల్‌వాల్ అనే స్టూడెంట్ ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ మ్యాక్ బుక్ కోసం ఆర్డర్ చేసాడు. అయితే అతనికి డెలివరీ విషయంలో కొంత ఆలస్యం జరిగడంతో అతడే నేరుగా ఫ్లిప్‌కార్ట్ హబ్‌కు వెళ్లి ఆర్డర్ తీసుకున్నాడు.
Indian student gets boAt speakers instead of MacBook: ఆన్ లైన్ ఆర్డర్ ఓ భారతీయ విద్యార్థికి షాక్ ఇచ్చింది. వివరాల్లోకెళితే.. అథర్వ ఖండేల్‌వాల్ అనే స్టూడెంట్ ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ మ్యాక్ బుక్ కోసం ఆర్డర్ చేసాడు. అయితే అతనికి డెలివరీ విషయంలో కొంత ఆలస్యం జరిగడంతో అతడే నేరుగా ఫ్లిప్‌కార్ట్ హబ్‌కు వెళ్లి ఆర్డర్ తీసుకున్నాడు. అయితే పార్సిల్ ఓపెన్ చేసి చూడగానే అందులో మ్యాక్ బుక్ బదులు 'బోట్ స్పీకర్స్' ఉన్నాయి. అతడు బుక్ చేసుకున్న యాపిల్ మ్యాక్ బుక్ ధర రూ. 76000. అయితే అతనికి కేవలం రూ. 3000 విలువైన బోట్ స్పీకర్స్ రావడంతో ఒక్కసారిగా నిర్గాంతపోయాడు.
అతనికి జరిగిన నష్టాన్ని రీఫండ్ చేయాలనీ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి అడిగితే వారు ఓపెన్ బాక్స్‌కు వర్తించే నో రీఫండ్ పాలసీ ప్రకారం, రీఫండ్ ఇవ్వడం కుదరదని చెప్పినట్లు సమాచారం. దీనికి సంబందించిన సమాచారం అతడు ట్విటర్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫ్లిప్‌కార్ట్ ల్యాప్‌టాప్ అమౌంట్ రీఫండ్ చేస్తుందా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
Here's His Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)