McKinsey Layoffs: ఆగని లేఆప్స్, 360 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న గ్లోబల్ కన్సల్టింగ్ దిగ్గజం మెకిన్సీ, ఆర్థిక మాంద్య భయాలే కారణం
సంస్థలో పనిచేస్తున్న వారిలో 3 శాతం మందిని తొలగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ (Bloomberg) నివేదించింది.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 360 మంది ఉద్యోగులను తొలగించడానికి మెకిన్సీ సిద్ధమైనట్లు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది.
గ్లోబల్ కన్సల్టింగ్ దిగ్గజం మెకిన్సీ (McKinsey layoffs) తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. సంస్థలో పనిచేస్తున్న వారిలో 3 శాతం మందిని తొలగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ (Bloomberg) నివేదించింది.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 360 మంది ఉద్యోగులను తొలగించడానికి మెకిన్సీ సిద్ధమైనట్లు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. డిజైన్, డేటా ఇంజినీరింగ్, క్లౌడ్, సాఫ్ట్‌వేర్ సహా పలు విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 12,000 మంది సిబ్బందిపై ఈ లేఆఫ్స్ ప్రభావం ఉండనున్నట్లు పేర్కొంది. మెకిన్సీలో ప్రపంచవ్యాప్తంగా 45,000 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2021లో కంపెనీ 15 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది. భారతీయుని పేరును వెటకారం చేసిన కెనడా కంపెనీ, నెటిజన్లు దెబ్బకు దిగివచ్చి క్షమాపణలు, అయినా సరే..
Here's News