Canadian Company Dbrand offers Indian techie 10,000 Dolllers in apology after mocking his surname

ఓ భారతీయుడి పేరుపై వెటకారంగా వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శపాలైన కెనడా కంపెనీ ఎట్టకేలకు దిగివచ్చి భారతీయునికి క్షమాపణలు చెప్పింది. దీనిపై ఎక్స్ వేదికగా అతనికి గుడ్ విల్ కింద 10 వేల డాలర్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. విషయంలోకి వెళ్తే..భువన్‌ చిత్రాంశ్‌ అనే వ్యక్తి డీబ్రాండ్‌ (dbrand) అనే ఎలక్ట్రానిక్స్‌ యాక్సెసరీస్‌ కంపెనీ నుంచి మ్యాక్‌బుక్‌ ‘స్కిన్‌’ను కొనుగోలు చేశారు. అయితే రెండు నెలలకు అది రంగు మారడంతో ఎక్స్ వేదికగా కంపెనీకి ఫిర్యాదు చేశాడు. ట్రూకాలర్ నుంచి కొత్త ఫీచర్, ఇకపై యూజర్లు డెస్క్‌టాప్‌/ ల్యాప్‌టాప్‌ ద్వారా కూడా లాగిన్ కావొచ్చు, ఎలా చేయాలంటే..

దీనిపై స్పందించిన డీబ్ర్రాండ్ సంస్థ అతడి పేరులోని కొన్ని అక్షరాలను మార్చి విపరీతార్థం వచ్చేలా రాసింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక విదేశీయుడి పేరుపై వెటకారపు వ్యాఖ్యలు చేయడం తగదంటూ బుద్ధి చెప్పారు. భారత్‌ వంటి అతిపెద్ద మార్కెట్‌ ఇకపై మీ వస్తువులను కొనుగోలు చేయకపోవచ్చునని హెచ్చరించారు.

Here's X News

దీంతో డీబ్రాండ్‌ (dbrand) స్పందించింది. కస్టమర్‌ పేరును ఎగతాళి చేశామని అంగీకరించింది. దీన్ని అతిపెద్ద తడబాటుగా చెబుతూ క్షమాపణలు కోరింది. గుడ్‌విల్‌ కింద 10,000 డాలర్లు ఆఫర్‌ చేసింది. అయితే, ఇలా కస్టమర్లతో దాదాపు దశాబ్దకాలంగా చేస్తున్నామని, తర్వాత 10,000 డాలర్లను అందుకోబోయేది మీరే కావొచ్చంటూ మళ్లీ తన బుద్ధిని మళ్లీ బయటపెట్టుకుంది.