McKinsey Begins Layoffs: ఉద్యోగులను పీకేస్తున్న మరో దిగ్గజం, 2,000 మంది ఉద్యోగులను తొలగించనున్న ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సీ, ఆర్థిక మాంద్య భయాలే కారణం
ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సీ అండ్ కంపెనీ 2,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.తమ క్లయింట్లతో నేరుగా సంబంధం ఉండని సహాయక సిబ్బందిని తొలగించే యోచనలో మెకిన్సీ (McKinsey & Co) ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఉన్నతోద్యోగులు తెలిపారు.
ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సీ అండ్ కంపెనీ 2,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.తమ క్లయింట్లతో నేరుగా సంబంధం ఉండని సహాయక సిబ్బందిని తొలగించే యోచనలో మెకిన్సీ (McKinsey & Co) ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఉన్నతోద్యోగులు తెలిపారు. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలతో వచ్చే 2-3 వారాల్లో తొలగింపుల ప్రణాళికను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
2012లో మెకిన్సీలో 17,000 మంది ఉద్యోగులు ఉండేవారు. ఐదేళ్ల క్రితం నాటికి ఆ సంఖ్య 28,000కు చేరింది. ఇప్పుడు అది 45,000గా ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే, క్లయింట్లతో నేరుగా పనిచేసే నిపుణుల నియామక ప్రక్రియ మాత్రం ఆగబోదని కంపెనీలోని ఓ ఉన్నతోద్యోగి తెలిపారు. 2021లో కంపెనీ ఆదాయం 15 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2022 ఫలితాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)