Alzheimer's Treatment: సూర్యరశ్మితో (లైట్ థెరపీ) శరీరానికి డీ-విటమిన్ మాత్రమే కాదు.. అల్జీమర్స్ కు చెక్!
ఉదయంపూట సూర్యరశ్మితో (లైట్ థెరపీ) శరీరానికి డీ-విటమిన్ మాత్రమే కాదు అల్జీమర్స్ వ్యాధి కూడా తగ్గే అవకాశమున్నదని పరిశోధకులు చెబుతున్నారు.
Hyderabad, Dec 15: ఉదయంపూట సూర్యరశ్మితో (Sunlight) (లైట్ థెరపీ) శరీరానికి డీ-విటమిన్ మాత్రమే కాదు అల్జీమర్స్ (Alzheimers) వ్యాధి కూడా తగ్గే అవకాశమున్నదని పరిశోధకులు చెబుతున్నారు. సూర్యరశ్మిలో కాసేపు ఉన్న తర్వాత శరీరం అలసట చెంది ప్రశాంతమైన నిద్ర వస్తుందని, ఇలాంటి నిద్ర మెమొరీ సెల్స్ (Memory Cells) ను ఉత్తేజితం చేయడంలో సాయపడుతుందని అంటున్నారు. 2005 నుంచి 2022 మధ్య 598 మంది రోగులపై చేసిన పలు అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైనట్టు చెబుతున్నారు.