Chandrayaan-3: వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చంద్రయాన్-3 ప్రతిమ, శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న ఇస్రో చైర్మెన్, రేపే చంద్రయాన్ -3 ప్రయోగం
యోగం సక్సెస్ కావాలని కోరుతూ ఇవాళ ఉదయం ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్.. తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు.
రేపు మధ్యాహ్నం 2.35 నిమిషాలకు రాకెట్ ద్వారా చంద్రయాన్-3ను నింగిలోకి ఇస్రో ప్రవేశపెట్టనుంది. యోగం సక్సెస్ కావాలని కోరుతూ ఇవాళ ఉదయం ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్.. తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆగస్టు 23వ తేదీన చంద్రయాన్-3 రోవర్.. చంద్రుడిపై దిగుతుందని ఆయన తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తల బృందం ఇవాళ తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. చంద్రయాణ్-3 ప్రతిమతో శాస్త్రవేత్తలు ఆలయాన్ని విజిట్ చేశారు.
నేషనల్ అట్మాస్పియరిక్ రీసర్చ్ ల్యాబరేటరీ డైరెక్టర్ అమిత్ కుమార్ పత్రా, చంద్రయాన్-3 ప్రాజెక్టు డైరెక్టర్ వీరాముత్తు వేల్, అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కల్పనా కాళహస్తితో పాటు ఇతర శాస్త్రవేత్తలు కూడా ఇవాళ శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
ANI Video