Chandrayaan 3: వీడియో ఇదిగో, చందమామపై మెల్లిగా దిగిన విక్రమ్ ల్యాండర్, యానిమేషన్ రూపంలో ఊహాజనిత వీడియోను విడుదల చేసిన PIB
కోట్లాది మంది భారతీయులు ఆశలను మోసుకుంటూ వెళ్లిన చంద్రయాన్ 3 మరికొద్ది గంటల్లో మన వ్యోమనౌక జాబిల్లి (Moon) దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది.ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ కానున్నట్లు ఇస్రో ఇప్పటికే వెల్లడించింది.
కోట్లాది మంది భారతీయులు ఆశలను మోసుకుంటూ వెళ్లిన చంద్రయాన్ 3 మరికొద్ది గంటల్లో మన వ్యోమనౌక జాబిల్లి (Moon) దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది.ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ కానున్నట్లు ఇస్రో ఇప్పటికే వెల్లడించింది. ఈ క్రమంలోనే 40 రోజుల చంద్రయాన్-3 ప్రయాణాన్ని 60 సెకన్లలో చూపిస్తూ PIB (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఓ వీడియో రూపొందించింది.
ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు చంద్రయాన్-3 (Chandrayaan-3)ను రూపొందించినప్పటి నుంచి షార్ వేదిక వద్ద ప్రయోగం, రోదసిలోకి దూసుకెళ్లడం, భూకక్ష్యలో నుంచి చంద్రుడి కక్ష్యలోకి మారడం వంటివి ఇందులో చూపించారు. చివరగా జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ అడుగుపెట్టినట్లు ఆ వీడియోలో ఉంది. విక్రమ్ ల్యాండర్ కిందకు దిగగానే అందులోని ప్రజ్ఞాన్ రోవడ్ జారుకుంటూ బయటకు వచ్చినట్లు ఊహాజనితంగా యానిమేషన్ రూపంలో వీడియోలో చూపించారు. వీడియో ఇదిగో..
Here's Video