ISRO Scientist N Valarmathi Dies: గుండెపోటుతో ఇస్రో శాస్త్రవేత్త మృతి, మిషన్ల కౌంట్‌డౌన్‌లకు ఇక నుంచి ఆ వాయిస్ వినిపించదంటూ మాజీ డైరెక్టర్ ట్వీట్

చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మరణించారు.వలర్మతి చివరగా చంద్రయాన్ 3కి వాయిస్ ఓవర్ ఇచ్చారు

ISRO Scientist N Valarmathi Dies (Photo-X)

చంద్రయాన్ 3 ప్రయోగ సమయంలో వాయిస్ ఓవర్ ఇచ్చిన, ఇస్రో శాస్త్రవేత్త ఎన్ వలర్మతి గుండెపోటుతో శనివారం తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మరణించారు.వలర్మతి చివరగా చంద్రయాన్ 3కి వాయిస్ ఓవర్ ఇచ్చారు.భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహమైన RISAT-1 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కూడా వలర్మతి పని చేశారు. 1959లో తమిళనాడులోని అరియలూర్‌లో జన్మించిన వలర్మతి 1984లో ఇస్రోలో చేరారు.

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని వలర్మతి మొదటిసారిగా 2015లో అందుకున్నారు.వాలర్మతి మృతికి ప్రముఖులంతా సంతాపం తెలుపుతున్నారు.శ్రీహరి కోట నుంచి ఇస్రో భవిష్యత్‌లో ప్రయోగించే మిషన్ల కౌంట్‌డౌన్‌లకు ఇక నుంచి వాలర్మతి మేడమ్ వాయిస్ వినిపించదని ఇస్రో మాజీ డైరెక్టర్ డాక్టర్ పీవీ వెంకటకృష్ణన్ ట్విటర్‌లో ట్వీట్ చేశారు.ఇది ఊహించని మరణం అని, చాలా బాధగా ఉందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ISRO Scientist N Valarmathi Dies (Photo-X)

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)