Tech Layoffs 2024: టెక్ రంగంలో ఆగని లేఆప్స్, 150 మంది ఉద్యోగులను తొలగించిన జూమ్, 400 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన ఆక్టా

ఉద్యోగుల తొలగింపులు కంపెనీ వ్యాప్తం కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సేల్స్, ప్రొడక్ట్ మరియు కార్యకలాపాల్లో 2024లో తమ నియామకాలను కొనసాగిస్తామని జూమ్ తెలిపింది.

Layoffs Representative Image (Photo Credit: Pixabay)

వీడియో కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ జూమ్ దాదాపు 150 మంది ఉద్యోగులను లేదా కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో 2 శాతం కంటే తక్కువ మందిని తొలగిస్తోంది. ఉద్యోగుల తొలగింపులు కంపెనీ వ్యాప్తం కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సేల్స్, ప్రొడక్ట్ మరియు కార్యకలాపాల్లో 2024లో తమ నియామకాలను కొనసాగిస్తామని జూమ్ తెలిపింది. గత ఫిబ్రవరిలో, జూమ్ దాదాపు 1,300 ఉద్యోగాలను లేదా దాదాపు 15 శాతం ఉద్యోగులను తగ్గించింది.

జూమ్‌తో పాటు, క్లౌడ్ సాఫ్ట్‌వేర్ విక్రేత ఆక్టా కూడా దాదాపు 400 మంది ఉద్యోగులను లేదా దాదాపు 7 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.మేము మరింత సామర్థ్యంతో వ్యాపారాన్ని నడపాలి. మేము సరైన దిశలో అడుగులు వేసినప్పటికీ, వాస్తవికత ఏమిటంటే ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మేము మా మొత్తం ఖర్చును గుర్తుంచుకోవాలని Okta CEO టాడ్ మెక్‌కిన్నన్ తెలిపారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)