Twitter Down: మరోసారి మొరాయించిన ట్విట్టర్, లాగిన్ సమస్యలతో ఇబ్బందిపడ్డ వేలాది మంది యూజర్లు, గత రెండు వారాల్లో ఇది రెండో సారి
లాగిన్ సమస్యతో వేలాది మంది యూజర్లు ఇబ్బంది పడ్డారు. ఈ మేరకు డౌన్ డిటెక్టర్. కామ్ కు(Downdetector.com) వేలాది ఫిర్యాదులు వచ్చాయి. అమెరికా సహా పలు దేశాల్లో వేలాది మంది యూజర్లు ట్విట్టర్ లో లాగిన్ అయ్యేందుకు ఇబ్బందులు ఎదుర్కున్నారు. దీనిపై ట్విట్టర్ (Twitter down) నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు
Washington, DEC 29: ట్విట్టర్ మరోసారి డౌన్ (Twitter down) అయింది. లాగిన్ సమస్యతో వేలాది మంది యూజర్లు ఇబ్బంది పడ్డారు. ఈ మేరకు డౌన్ డిటెక్టర్. కామ్ కు(Downdetector.com) వేలాది ఫిర్యాదులు వచ్చాయి. అమెరికా సహా పలు దేశాల్లో వేలాది మంది యూజర్లు ట్విట్టర్ లో లాగిన్ అయ్యేందుకు ఇబ్బందులు ఎదుర్కున్నారు. దీనిపై ట్విట్టర్ (Twitter down) నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు కానీ, చాలా మంది యూజర్లు మాత్రం ట్విట్టర్ డౌన్ అనే హ్యష్‌ట్యాగ్ తో ట్వీట్లు చేశారు. దాదాపు పది వేల కంప్లైట్లు వచ్చినట్లు Downdetecter.com పేర్కొంది. గతంలో కూడా ట్విట్టర్ ఇలా సడెన్ గా డౌన్ అయిన సందర్భాలున్నాయి. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ట్విటర్ తరచూ వార్తల్లో నిలుస్తోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)