UPI Transaction Charges: యూపీఐ చెల్లింపులు ఉచితం, కస్టమర్లకు ఎలాంటి ఛార్జీలు వర్తించవని తెలిపిన ఎన్‌పీసీఐ, పీపీఐ ద్వారా చెల్లింపులకు మాత్రమే రుసుం
ఏప్రిల్ 1 నుంచి పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా రూ.2000లకు పైగా లావాదావేలు చేస్తే అదనపు చార్జీలు ఉంటాయని, ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ చార్జీలు యూజర్లకు వర్తించవు.
ఏప్రిల్ 1 నుంచి పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా రూ.2000లకు పైగా లావాదావేలు చేస్తే అదనపు చార్జీలు ఉంటాయని, ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ చార్జీలు యూజర్లకు వర్తించవు. ఆన్‌లైన్ వాలెట్‌లు లేదా ప్రీ లోడెడ్ గిఫ్ట్ కార్డ్‌లు మొదలైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పీపీఐ) ద్వారా రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలకు ఇంటర్‌చేంజ్ రుసుము విధించేందుకు ఎన్‌పీసీఐ ప్రతిపాదనలు చేసింది.
ఇంటర్‌చేంజ్ రుసుము అనేది వ్యాలెట్ జారీ చేసే బ్యాంకులు లావాదేవీలను అంగీకరించడం, ప్రాసెస్ చేయడం, ఆథరైజ్ చేయడం వంటి వాటి కోసం పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి పేమెంట్స్ సర్వీస్ ప్రొవైడర్లు చెల్లించాల్సిన రుసుము. వ్యక్తి-వ్యక్తి లావాదేవీలు లేదా వ్యక్తి నుంచి వ్యాపారి లావాదేవీలకు ఈ ఇంటర్‌చేంజ్ రుసుము వర్తించదు. అంటే యూపీఐ చెల్లింపులు చేసే యూజర్లు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.పీపీఐ ద్వారా చేసిన రూ. 2,000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలకు 1.1 శాతం ఇంటర్‌చేంజ్ ఫీజు ఉంటుంది. ఆపై వాలెట్ లోడింగ్ ఛార్జీలు ఉంటాయి.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)