Vijay Shekhar Sharma Resigns: పేటీఎం బ్యాంకుకు బిగ్ షాక్, చైర్మన్ పదవికి రాజీనామా చేసిన విజయ్ శేఖర్ శర్మ, కొత్త ఛైర్మన్‌ని నియమించే ప్రక్రియ ప్రారంభించిన One 97 కమ్యూనికేషన్

fintech Paytm యొక్క మాతృ సంస్థ అయిన One 97 Communication, వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ Paytm పేమెంట్స్ బ్యాంక్ (PPBL) బోర్డు నుండి రాజీనామా చేసినట్లు ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది .

Paytm Payments Bank (Photo Credit: X/ @ANI)

Vijay Shekhar Sharma steps down as PPBL Chairman: విజయ్ శేఖర్ శర్మ Paytm పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ పదవి నుండి వైదొలిగారు. fintech Paytm యొక్క మాతృ సంస్థ అయిన One 97 Communication, వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ Paytm పేమెంట్స్ బ్యాంక్ (PPBL) బోర్డుకు రాజీనామా చేసినట్లు ఎక్స్ఛేంజీలకు తెలియజేసినట్లుగా ప్రకటన వెలువడింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేబేంద్రనాథ్ సారంగి, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గార్గ్, రిటైర్డ్ ఐఏఎస్ రజనీ సెఖ్రీ సిబల్ స్వతంత్ర డైరెక్టర్లుగా బోర్డులో చేరారు. PPBL కొత్త ఛైర్మన్‌ని నియమించే ప్రక్రియను ప్రారంభిస్తుందని One 97 కమ్యూనికేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement