Boris Johnson Resigns: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా, తదుపరి ప్రధాని ఎన్నికయ్యే వరకు తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతానని వెల్లడి
మంత్రులు వరుసగా రాజీనామాలు చేయడం వల్ల ఆయన పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించినట్లు బ్రిటన్ మీడియా, పలు మీడియా ఛానెల్స్ కథనాలు చెబుతున్నాయి.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. మంత్రులు వరుసగా రాజీనామాలు చేయడం వల్ల ఆయన పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించినట్లు బ్రిటన్ మీడియా, పలు మీడియా ఛానెల్స్ కథనాలు చెబుతున్నాయి. తదుపరి ప్రధాని ఎన్నికయ్యే వరకు తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతారని స్థానిక మీడియా తెలిపింది. బోరిస్ రాజీనామా, తదుపరి ప్రధాని ఎవరనే విషయాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. బోరిస్ జాన్సన్‌పై తిరుగుబాటు చేసి ఇప్పటికే 54 మంది మంత్రులు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో బోరిస్ ప్రధాని బాధ్యతల నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)