China Earthquake Video: చైనా భూకంపానికి ఇళ్లు ఎలా కుదేలయ్యాయో వీడియోల్లో చూడండి, 111 మంది మృతి, 220 మందికి తీవ్ర గాయాలు

గత అర్ధరాత్రి సమయంలో సంభవించిన భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. భారీ సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. సహాయక బృందాలు ఇప్పటిదాకా 111కిపైగా మృతదేహాల్ని వెలికి తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

China Earthquake (photo-X)

పొరుగు దేశం చైనాను భారీ భూకంపం కుదిపేసింది. గత అర్ధరాత్రి సమయంలో సంభవించిన భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. భారీ సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. సహాయక బృందాలు ఇప్పటిదాకా 111కిపైగా మృతదేహాల్ని వెలికి తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అక్కడి కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక.. వాయువ్య గన్స్‌, కింగ్‌హై ప్రావిన్స్‌ల్లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.2గా నమోదైంది. యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే మాత్రం 5.9గా పేర్కొంది. భూకంపం వల్ల వందల మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్నవాళ్లను బయటకు తీసే క్రమంలో మృతదేహాలు బయటపడుతున్నాయి.

Here's Video