China Plane Crash: కొండల్లో కుప్పకూలిన బోయింగ్‌ 737 విమానం, 133 మంది ప్రయాణికులు ఆచూకి గల్లంతు, రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టినట్లు తెలిపిన చైనా అధికారులు

దీంతో భారీగా అగ్నికీలలు, దట్టంగా పొగలు ఎగసిపడినట్లు చైనా అధికార మీడియా సీసీటీవీ తెలిపింది. అందులో 133 మంది ప్రయాణిస్తున్నారు. ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధికారులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టినట్లు పేర్కొంది.

China Eastern Airlines (Credits: Wikimedia Commons)

చైనా ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం వుజౌ నగరానికి సమీపంలోని గ్రామీణ ప్రాంతంలోని కొండల్లో కూలిపోయింది. దీంతో భారీగా అగ్నికీలలు, దట్టంగా పొగలు ఎగసిపడినట్లు చైనా అధికార మీడియా సీసీటీవీ తెలిపింది. అందులో 133 మంది ప్రయాణిస్తున్నారు. ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధికారులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టినట్లు పేర్కొంది. చైనా విమానం కూలిన ఘటనలో ఎంత మంది మరణించి ఉంటారన్నది తెలియరాలేదు. అయితే విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. దీంతో ఆ విమానంలోని ప్రయాణికులు, సిబ్బందికి చెందిన బంధువులు, ఆప్తులు ఆందోళన చెందుతున్నారు.