Same-Sex Marriage in Cuba: క్యూబాలో స్వలింగ సంపర్కులు పెళ్లి చట్టానికి ఆమోదం, 66.9 శాతం ఓట్లతో ఆమోదముద్ర వేసినట్లు తెలిపిన జాతీయ ఎన్నికల మండలి
దీంతో పాటు పిల్లల్ని దత్తత తీసుకునే అవకాశాన్ని ఆ జంటలకు కల్పించారు. రెఫరెండం నిర్వహించి ఆ చట్టానికి ఓకే చెప్పేశారు. ప్రజాభిప్రాయాన్ని 66.9 శాతం ఓట్లతో ఆమోదముద్ర వేసినట్లు జాతీయ ఎన్నికల మండలి తెలిపింది.
క్యూబాలో స్వలింగ సంపర్కులు వివాహం చేసుకునే వీలును కల్పిస్తూ కొత్త చట్టాన్ని రూపొందించారు. దీంతో పాటు పిల్లల్ని దత్తత తీసుకునే అవకాశాన్ని ఆ జంటలకు కల్పించారు. రెఫరెండం నిర్వహించి ఆ చట్టానికి ఓకే చెప్పేశారు. ప్రజాభిప్రాయాన్ని 66.9 శాతం ఓట్లతో ఆమోదముద్ర వేసినట్లు జాతీయ ఎన్నికల మండలి తెలిపింది. కొన్ని క్రైస్తవ సంఘాలు ఈ రెఫరెండమ్‌ను వ్యతిరేకించినా.. చివరకు స్వలింగ సంపర్కులకు అనుకూల తీర్పు వచ్చింది. ప్రెసిడెంట్ మిగుల్ డియాజ్ కెనాల్ మాట్లాడుతూ.. ఈ కొత్త చట్టానికి అనుకూలంగా భారీ సంఖ్యలో క్యూబన్లు ఓటు వేస్తారని అన్నారు. ప్రేమే ఇప్పుడు ఈ దేశంలో కొత్త చట్టమని ఆయన ట్వీట్ చేశారు.