Israel-Hamas War: ముగిసిన డెడ్‌ లైన్.. గాజా నుంచి తరలిపోయిన 10 లక్షల మంది.. భూతల దాడికి ఇజ్రాయెల్ రెడీ

గాజాను (Gaza Strip) విడిచిపెట్టాలంటూ ఇజ్రాయెల్ (Israel) ఇచ్చిన వార్నింగ్ డెడ్‌ లైన్ (Deadline) ముగిసింది. ఇప్పటి వరకు పది లక్షలమందికి పైగా పాలస్తీనీయులు గాజాను విడిచిపెట్టారు.

Israel-Hamas War (Credits: X)

Newdelhi, Oct 16: గాజాను (Gaza Strip) విడిచిపెట్టాలంటూ ఇజ్రాయెల్ (Israel) ఇచ్చిన వార్నింగ్ డెడ్‌ లైన్ (Deadline) ముగిసింది. ఇప్పటి వరకు పది లక్షలమందికి పైగా పాలస్తీనీయులు గాజాను విడిచిపెట్టారు. గాజాపై దండెత్తేందుకు సిద్ధమైన ఇజ్రాయెల్ ఇప్పటికే సరిహద్దులో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్), ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్స్ (ఐఏఎఫ్) సహా 4 లక్షల మంది రిజర్వులను మోహరించింది.  గాజాపై భూతలదాడికి సిద్ధమైన ఇజ్రాయెల్ జనసాంద్రత కలిగిన గాజా ఉత్తర ప్రాంతానికి నీళ్లు, విద్యుత్తు సరఫరా నిలిపివేసింది. ఆహారం అందకుండా చేసింది. గాజా దక్షిణ ప్రాంతానికి మాత్రం నిన్న నీటి సరఫరాను పునరుద్ధరించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement