Indonesia Earthquake: ఇండోనేషియా బాలి సముద్రంలో భారీ భూకంపం… రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో భూకంపం.. సునామీ ప్రభావం ఉందా?

ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో ఉందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది.

Earthquake Representative Image (Photo Credit: PTI)

 Newdelhi, Aug 29: ఇండోనేషియాలోని (Indonesia) బాలి సముద్ర ప్రాంతంలో (Bali Sea Region) మంగళవారం భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో ఉందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది. భూకంప కేంద్రం ఇండోనేషియాలోని మాతరానికి ఉత్తరంగా 201 కిలోమీటర్ల దూరంలో భూమి ఉపరితలం నుంచి 518 కిలోమీటర్లు దిగువన ఉందని ఇండోనేషియా అధికారులు చెప్పారు. సముద్రగర్భంలో లోతుగా సంభవించిన భూకంపం ఫలితంగా సునామీ వచ్చే ప్రమాదం లేదని యూఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ తెలిపింది.

APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ.. మొత్తం 597 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. గ్రూప్ 1లో 89, గ్రూప్ 2లో 508 పోస్టుల భర్తీ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)