Israel-Hamas War: వీడియో ఇదిగో, గాజాలో హమాస్‌ చీఫ్‌ ఇంటిపై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్‌ సైన్యం, టెర్రరిస్టు కార్యకలాపాలకు నిలయమంటూ..

గాజాలోని హమాస్‌ అధినేత ఇస్మాయిల్‌ హనియే (Ismail Haniyeh) ఇంటిపై ఇజ్రాయెల్‌ ఫైటర్‌ జెట్లు బాంబులు కురిపించాయి. ఈ దాడుల్లో హనియే ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్‌ తమ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది. హనియే ఇల్లు ‘టెర్రరిస్టు కార్యకలాపాలకు నిలయం’ గా ఐడీఎఫ్‌ అభివర్ణించింది.

Israel-Hamas War (Photo-X)

ఇజ్రాయెల్‌ – హమాస్‌ మధ్య యుద్ధం (Israel – Hamas War) నివురుగప్పిన నిప్పులా కొనసాగుతోంది. హమాస్‌ మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం విరుచుకుపడుతోంది. గాజాను చుట్టుముట్టిన ఐడీఎఫ్‌ దళాలు.. హమాస్‌ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా హమాస్‌ చీఫ్‌ (Hamas Political Chief) ఇంటిపై బాంబుల వర్షం కురిపించాయి.

గాజాలోని హమాస్‌ అధినేత ఇస్మాయిల్‌ హనియే (Ismail Haniyeh) ఇంటిపై ఇజ్రాయెల్‌ ఫైటర్‌ జెట్లు బాంబులు కురిపించాయి. ఈ దాడుల్లో హనియే ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్‌ తమ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది. హనియే ఇల్లు ‘టెర్రరిస్టు కార్యకలాపాలకు నిలయం’ గా ఐడీఎఫ్‌ అభివర్ణించింది. ఇజ్రాయెల్ సైన్యం, పౌరులపై తీవ్రవాద దాడులకు సంబంధించిన సమావేశాలు ఇక్కడే జరుగుతుంటాయిని తెలిపింది. ఇక్కడి నుంచే ఆదేశాలు వెళ్తుంటాయని పేర్కొంది.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now