Boris Johnson: పుతిన్ ఆడది అయి ఉంటే... సంచలన వ్యాఖ్యలు చేసిన బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్, ఆయన అమ్మాయి అయి ఉంటే యుద్ధానికి వెళ్లేవాడు కాదని తెలిపిన బోరిస్ జాన్స‌న్

ఒక‌వేళ పుతిన్ ఆడ‌దై ఉంటే, నిజానికి కాదు అనుకోండి, కానీ ఒక‌వేళ అయి ఉంటే, బ‌హుశా అత‌ను ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లి ఉండేవాడు కాదు అని బ్రిట‌న్ ప్ర‌ధాని తెలిపారు

File image of Boris Johnson | (Photo Credits: Getty Images)

ఒకవేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ మ‌హిళ అయి ఉంటే.. ఉక్రెయిన్‌పై అత‌ను యుద్ధం చేసేవాడు కాదు అని బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ అన్నారు. జ‌ర్మ‌నీ మీడియా సంస్థ జేడీఎఫ్‌తో మాట్లాడుతూ బోరిస్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వేళ పుతిన్ ఆడ‌దై ఉంటే, నిజానికి కాదు అనుకోండి, కానీ ఒక‌వేళ అయి ఉంటే, బ‌హుశా అత‌ను ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లి ఉండేవాడు కాదు అని బ్రిట‌న్ ప్ర‌ధాని తెలిపారు. ఉక్రెయిన్‌పై ఆక్ర‌మ‌ణ‌కు వెళ్ల‌డం అంటే అది విష‌పూరిత‌మైన మ‌గ‌బుద్ధి అని బోరిస్ అన్నారు. అమ్మాయిల‌కు ఉత్త‌మ చ‌దువును అందించాల‌ని కోరుకున్నారు. శ‌క్తివంత‌మైన స్థానాల్లో మ‌హిళ‌లు అధిక సంఖ్య‌లో ఉండాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement