India-Canada Tension: కెనడాలో భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండండి, అడ్వైజరీ జారీ చేసిన భారత విదేశాంగ శాఖ
తాజాగా కెనడాలోని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఆ దేశంలోని పౌరులు, విద్యార్థులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు మధ్య కెనడా-భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. తాజాగా కెనడాలోని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఆ దేశంలోని పౌరులు, విద్యార్థులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు, రాజకీయ అండతో జరుగుతున్న విద్వేషపూరిత నేరాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు (Indian Nationals) తమ ప్రయాణాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
ఇండియా వ్యతిరేక ఎజెండాను వ్యతిరేకిస్తున్న భారత కమ్యూనిటీ ప్రజలను, మన దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల కాలంలో బెదిరింపులు వస్తున్నాయి. అందువల్ల అలాంటి హింసాత్మక ఘటనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లొద్దని కోరుతున్నాం’’ అని కేంద్ర విదేశాంగ శాఖ (MEA) బుధవారం ప్రకటన విడుదల చేసింది.కెనడాలోని భారత పౌరులు ఒట్టావాలోని హైకమిషన్ లేదా టొరంటో, వాంకోవర్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద తమ పేర్లను నమోదు చేసుకోండి. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు మిమ్మల్ని వేగంగా సంప్రదించేందుకు వీలవుతుంది’’ అని విదేశాంగ శాఖ తమ అడ్వైజరీలో సూచించింది.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)