WHO Flags Cold Out Syrup: భారత్‌ తయారీ దగ్గు మందు సురక్షితం కాదని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక, కోల్డ్‌ అవుట్‌ సిరప్‌లో పదార్థాలు పరిమితికి మించి ఉన్నాయని ఆందోళన

ఇరాక్‌లో విక్రయిస్తున్న భారత్‌ తయారీ దగ్గు మందు సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జలుబు, దగ్గు నివారణ కోసం ‘కోల్డ్‌ అవుట్‌’ పేరుతో దగ్గు రూపొందించిన సిరప్‌ తయారీలో వాడే పదార్థాలు పరిమితికి మించి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

World Health Organization (Photo Credit: ANI)

ఇరాక్‌లో విక్రయిస్తున్న భారత్‌ తయారీ దగ్గు మందు సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జలుబు, దగ్గు నివారణ కోసం ‘కోల్డ్‌ అవుట్‌’ పేరుతో దగ్గు రూపొందించిన సిరప్‌ తయారీలో వాడే పదార్థాలు పరిమితికి మించి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. చెన్నైకు చెందిన ఫోర్ట్స్‌ ల్యాబోరేటరీస్‌ కంపెనీ తయారు చేసిన కోల్డ్‌ అవుట్‌ అనే దగ్గు మందును ఇరాక్‌కు చెందిన దాబిలైఫ్‌ ఫార్మాకు విక్రయించింది.

ఈ మందులో డైథిలీన్‌ ఇథలీన్‌ మోతాదుకు మించి ఉన్నట్టుగా డబ్ల్యూహెచ్‌ఒ గుర్తించింది. కోల్డ్‌ అవుట్‌లో 0.25% డైఇథలీన్‌, 2.1% ఇథలీన్‌ గ్లైకాల్‌లు ఉన్నట్లు తెలిపింది. ఈ దీని వినియోగం సురక్షితం కాదని డబ్ల్యూహెచ్‌వో సూచించింది చిన్నారులు ఈ మందు తాగితే అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. తీవ్ర అస్వస్థతకు గురై మరణం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement