Elon Musk: ఐక్యరాజ్య సమితిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం అనుచితం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు

ప్రస్తుత పరిస్థితికి, మారిన కాలానికి అనుగుణంగా ఆయా దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని తన ట్వీట్ లో పేర్కొన్నాడు

Elon Musk and Modi (Photo-ANI)

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో (UN Security Council) శాశ్వత సభ్యత్వం లేకపోవడం అనుచితమంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితికి, మారిన కాలానికి అనుగుణంగా ఆయా దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ట్వీట్ పై మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు గుటెర్రస్ ఓ ట్వీట్ చేస్తూ.. భద్రతా మండలిలో ఆఫ్రికా ఖండం నుంచి ఒక్క దేశానికీ శాశ్వత సభ్యత్వం లేకపోవడం దురదృష్టకరమని అన్నారు.ఈ ట్వీట్ పై ఇజ్రాయెల్ వెంచర్ క్యాపిటలిస్ట్ మైఖేల్ ఐసెన్ బర్గ్ స్పందిస్తూ.. మరి భారత దేశం సంగతేంటని గుటెర్రస్ ను ప్రశ్నించారు.ఈ చర్చలో ఎలాన్ మస్క్ కూడా తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. భూమి మీద అత్యధిక జనాభా ఉన్న దేశంగా అవతరించిన భారత్ కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం అసంబద్ధమని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలలో సంస్కరణలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఇక ఐక్యరాజ్య సమితిని పూర్తిగా రద్దు చేసి, సరికొత్త నాయకత్వంతో, ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా మరో కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని ఐసెన్ బర్గ్ సూచించారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)