Indian Navy Rescues Chinese Sailor: వీడియో ఇదిగో, సముద్రపు నౌకలో తీవ్రంగా నెత్తురోడుతున్న చైనా నావికుడిని రక్షించిన భారత నౌకాదళం
ఎమర్జెన్సీ కాల్ రావడంతో సీకింగ్ హెలికాప్టర్‌తో భారత నావికాదళం రంగం లోకి దిగింది. తీవ్రమైన గాలులతో ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ సాహసించి చైనా నౌకలోకి దిగింది. తీవ్రంగా నెత్తురోడుతున్న ఆ నావికుడిని హెలికాప్టర్‌లో ఎక్కించుకుని తీసుకురాగలిగింది. అనంతరం బాధితుడిని ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్యం అందించి రక్షించ గలిగారు
చైనాకు చెందిన సరకు రవాణా నౌకలో అత్యవసర వైద్య చికిత్స కోసం ఎదురుచూస్తున్న చైనా నావికుడిని భారత నౌకా దళం హై-సీస్ ఆపరేషన్ ద్వారా రక్షించింది. ముంబై తీరానికి దాదాపు 200 నాటికల్ మైళ్ల ( సుమారు 370 కిమీ ) దూరంలో చైనాకు చెందిన ఝాంగ్ షాన్ మెన్ అనే సరకు నౌక ఉండగా, అందులోని చైనా నావికుడికి అత్యవసర వైద్యం అందించాలని ముంబైలోని మారిటైం రెస్కూ కో ఆపరేషన్ సెంటర్‌కు చైనా నౌకాదళం విజ్ఞప్తి చేసింది. నేపాల్ ఘోర విమాన ప్రమాదంలో 18 మంది మృతి, తీవ్ర గాయాలతో బయటపడిన పైలట్, టేకాఫ్ అయిన క్షణాల్లోనే కూలిపోయిన శౌర్య ఎయిర్‌లైన్స్ విమానం
అక్కడ నుంచి ఎమర్జెన్సీ కాల్ రావడంతో సీకింగ్ హెలికాప్టర్‌తో భారత నావికాదళం రంగం లోకి దిగింది. తీవ్రమైన గాలులతో ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ సాహసించి చైనా నౌకలోకి దిగింది. తీవ్రంగా నెత్తురోడుతున్న ఆ నావికుడిని హెలికాప్టర్‌లో ఎక్కించుకుని తీసుకురాగలిగింది. అనంతరం బాధితుడిని ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్యం అందించి రక్షించ గలిగారు. ఈ పరిస్థితిలో ఇండియన్ కోస్ట్‌గార్డ్‌కు చెందిన సామ్రాట్ నౌకను కూడా సాయం కోసం వినియోగించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)