Russia-Ukraine War: రష్యా కాల్పుల్లో భారత విద్యార్థి మృతి, ఆందోళన చెందుతున్న మిగతా విద్యార్థులు

మంగళవారం ఖార్కీవ్‌లో రష్యన్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ భారత విద్యార్థి మృతి చెందాడు. కర్నాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్‌గా అధికారులు గుర్తించారు. ఉదయం ఖర్కీవ్‌లో జరిగిన దాడిలో చనిపోయినట్లు స్థానికి మీడియా ప్రకటించింది. విద్యార్థి మృతిని విదేశీ వ్యవహారాలశాఖ ధృవీకరించింది. ఈ ఘటనతో ఉక్రెయిన్‌లో ఉంటున్న మిగిలిన భారత విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.

Russian-Army

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆరో రోజు కూడా భీకరంగానే కొనసాగుతోంది. ఇప్పటికే కీవ్‌ ప్రజలు ఆ ప్రాంతాన్ని విడిచి సరిహద్దు దేశాలకు వెళ్లిపోయారు. ఇక అక్కడ చదువుకుంటున్న భారత విద్యార్థులను తిరిగి దేశానికి రప్పించే ప్రయత్నంలో కేంద్రం నిమగ్నమైన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం ఖార్కీవ్‌లో రష్యన్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ భారత విద్యార్థి మృతి చెందాడు. కర్నాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్‌గా అధికారులు గుర్తించారు. ఉదయం ఖర్కీవ్‌లో జరిగిన దాడిలో చనిపోయినట్లు స్థానికి మీడియా ప్రకటించింది. విద్యార్థి మృతిని విదేశీ వ్యవహారాలశాఖ ధృవీకరించింది. ఈ ఘటనతో ఉక్రెయిన్‌లో ఉంటున్న మిగిలిన భారత విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement