Japan Earthquake: జపాన్ భూకంపంలో 82కి పెరిగిన మృతుల సంఖ్య, 52 మంది మిస్సింగ్, ఇంకా ఎంతోమంది శిథిలాల కిందనే, యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న సహాయక చర్యలు

కొత్త ఏడాది రోజునే భారీ భూకంపం బారిన పడిన జపాన్‌లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇషికావా ప్రిఫెక్చర్‌లో సోమవారం రిక్టర్‌ స్కేల్‌పై 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య బుధవారానికి 82కు పెరిగింది. 51 మంది మిస్సయ్యారు

Japan earthquake

కొత్త ఏడాది రోజునే భారీ భూకంపం బారిన పడిన జపాన్‌లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇషికావా ప్రిఫెక్చర్‌లో సోమవారం రిక్టర్‌ స్కేల్‌పై 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య బుధవారానికి 82కు పెరిగింది. 51 మంది మిస్సయ్యారు. కాగా చలి విపరీతంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని ప్రధాని ఫుమియో కిషిదా బుధవారం చెప్పారు.

సగం కూలిన భవనాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుని ఉన్నారని సహాయక సిబ్బంది అంచనావేశారు. రాత్రంతా కేవలం నాలుగు డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉండటంతో చలిలో శిథిలాల వద్ద అన్వేషణ, గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. గాయపడిన 300 మందిని ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. 33,000 మందిని సహాయక శిబిరాలకు తరలించారు.

Here' Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement