Japan Plane Tragedy: జపాన్ ఘోర విమాన ప్రమాదంలో 5 మంది మృతి, కెప్టెన్‌కు తీవ్ర గాయాలు, రన్‌వేపై దిగుతుండగా కోస్ట్ గార్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఢీకొట్టిన జేఏల్‌ 516 విమానం

కాగా ఈ ఘటనలో ఐదుగురు కోస్ట్ గార్డ్ సభ్యులు మృతి చెందారు. అలాగే కెప్టెన్ తీవ్రంగా గాయపడ్డారని నివేదిక పేర్కొంది.

Japan-Airlines-Plane-Explodes (Photo-Video Grab)

జపాన్‌ను వరుస భూకంపాలు విషాకర ఘటన మరువక ముందే రాజధాని టోక్యో (Tokyo)లో ఓ విమానం భారీ మంటల్లో చిక్కుకుపోయింది.జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఏల్‌ 516 విమానం మంగళవారం టోక్యో ఎయిర్‌పోర్టులో అగ్ని ప్రమాదానికి గురైంది. హనేడా విమానాశ్రయం (Haneda airport ) రన్‌వేపై దిగుతుండగా అక్కడే ఉన్న కోస్టు గార్డు ఎయిర్‌క్రాఫ్ట్‌ (Coast Guard aircraft)ను ఢీకొట్టడంతో విమానంలో మంటలు చెలరేగాయి.

మంటల్లో విమానం పూర్తిగా కాలిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.ప్రమాదం జరిగిన సమయంలో జేఏల్‌ 516 విమానంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి 400 మంది ఉన్నారని ఎన్‌హెచ్‌కే పేర్కొన్నట్లు జపాన్‌ టైమ్స్‌ వెల్లడించింది. కాగా ఈ ఘటనలో ఐదుగురు కోస్ట్ గార్డ్ సభ్యులు మృతి చెందారు. అలాగే కెప్టెన్ తీవ్రంగా గాయపడ్డారని నివేదిక పేర్కొంది.

Here's News