Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో ఆగని హింస, హోటల్‌కు నిప్పు.. 24 మంది సజీవదహనం, కొన్ని గంటల్లోనే 100 మందికి పైగా ప్రాణాలు గాలిలోకి..
బంగ్లాదేశ్‌లో విధ్వంసం కొనసాగుతోంది. తాజాగా జషోర్ జిల్లాలో ఓ హోటల్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. మృతి చెందిన వారిలో ఒకరు ఇండోనేషియా పౌరుడు ఉన్నాడని లోకల్ మీడియా చెబుతోంది. ఆందోళనకారులు నిప్పు పెట్టిన జబీర్ ఇంటర్నేషనల్ హోటల్ అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్‌కు చెందినది.
బంగ్లాదేశ్‌లో విధ్వంసం కొనసాగుతోంది. తాజాగా జషోర్ జిల్లాలో ఓ హోటల్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. మృతి చెందిన వారిలో ఒకరు ఇండోనేషియా పౌరుడు ఉన్నాడని లోకల్ మీడియా చెబుతోంది. ఆందోళనకారులు నిప్పు పెట్టిన జబీర్ ఇంటర్నేషనల్ హోటల్ అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్‌కు చెందినది. వీడియో ఇదిగో, బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయం స్కాన్ టెంపుల్‌పై దాడి, ఆలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాలను పగులగొట్టిన దుండగులు
21 రోజులుగా విద్యార్థి సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు వందలాది మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 440కి చేరుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యం తీవ్రంగా కృషి చేస్తోంది. షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వీడిన కొన్ని గంటల్లోనే 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
Here's Fire Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)