Iranian President Raisi Dead: ఇరాన్ అధ్యక్షుడు చనిపోవడానికి 2 నిమిషాల ముందు వీడియో ఇదిగో, కిటికీ నుంచి రైసీ బయటకు చూస్తున్న దృశ్యాలు వైరల్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్( బెల్-212) ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. జోల్ఫా ప్రాంతం సమీపంలోని పర్వతప్రాంతాలను దాటుతుండగా ప్రతికూల వాతావరణం కారణంగా దట్టమైన అడవిలో కుప్పకూలింది
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్( బెల్-212) ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. జోల్ఫా ప్రాంతం సమీపంలోని పర్వతప్రాంతాలను దాటుతుండగా ప్రతికూల వాతావరణం కారణంగా దట్టమైన అడవిలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో రైసీతోపాటు విదేశాంగ మంత్రి, మరో ఎనిమిది అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడిచింది. హెలికాప్టర్ కూలిన ఘటన.. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం.. ఇరాన్ అధికారిక మీడియా వెల్లడి
అధ్యక్షుడి కాన్వాయ్‌లోని మరో రెండు హెలికాప్టర్లు గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుకున్నాయని తెలిపింది. ఇరాన్- అజర్‌బైజాన్ సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన ఓ డ్యామ్ ప్రారంభోత్సంలో పాల్గొని తిరిగి వచ్చే సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది.తాజాగా హెలికాప్టర్ ప్రమాదానికి ముందు రైసీకి చెందిన చివరి ఫోటో, వీడియోను ఇరాన్ మీడియా షేర్ చేసింది. ఇందులో రైసీ హెలికాప్టర్ కిటికీ నుంచి రైసీ బయటకు చూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి, ఇతర ఉన్నత అధికారులు కూడా ఉన్నారు. చాపర్‌లో వెళ్లడానికి ముందు అధికారులతో అధ్యక్షుడు మీటింగ్ ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా ఆ క్లిప్‌లో ఉన్నాయి. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)