Lidia Thorpe: పార్ల‌మెంట్ హౌజ్‌లోనే మహిళా ఎంపీపై లైంగిక వేధింపులు, నన్ను అస‌భ్య‌క‌రంగా ట‌చ్ చేశారంటూ సేనేట‌ర్‌పై ఆరోప‌ణ‌లు చేసిన ఆస్ట్రేలియా మ‌హిళా సేనేట‌ర్ లిడియా థోర్ప్

ఆస్ట్రేలియాకు చెందిన మ‌హిళా సేనేట‌ర్ లిడియా థోర్ప్(Senator Lidia Thorpe).. పార్ల‌మెంట్ హౌజ్‌లోనే ఓ సీనియ‌ర్ సేనేట‌ర్‌ త‌న‌లో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు ఆరోపించారు. సుర‌క్షిత‌మైన ప‌ని ప్ర‌దేశం కావాల‌ని ఆమె త‌న ప్ర‌సంగంలో తెలిపారు.

Credits: Google

ఆస్ట్రేలియాకు చెందిన మ‌హిళా సేనేట‌ర్ లిడియా థోర్ప్(Senator Lidia Thorpe).. పార్ల‌మెంట్ హౌజ్‌లోనే ఓ సీనియ‌ర్ సేనేట‌ర్‌ త‌న‌లో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు ఆరోపించారు. సుర‌క్షిత‌మైన ప‌ని ప్ర‌దేశం కావాల‌ని ఆమె త‌న ప్ర‌సంగంలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ తానేమీ చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు కోర‌డం లేద‌ని, లేదా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం లేద‌ని, ఇలాంటి ప్ర‌వ‌ర్త‌న ఉన్న వ్య‌క్తి కూడా ఎవ‌రూ లేర‌ని ఆమె క‌న్నీళ్లు పెట్టుకున్నారు.

పార్ల‌మెంట్ హౌజ్‌లోనే లైంగిక‌ప‌ర‌మైన వ్యాఖ్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌ని, కొంద‌రు వ్య‌క్తులు త‌న‌ను అనుచితంగా ట‌చ్ చేసిన‌ట్లు ఆమె తెలిపారు. ఓ సేనేట‌ర్ త‌న‌ను పార్ల‌మెంట్ హౌజ్‌లోనే వెంబ‌డించార‌ని, సాక్ష్యులు.. కెమెరాలు లేని చోట అత‌ను అస‌భ్య‌క‌ర రీతిలో త‌న‌ను తాకిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. లిబ‌రల్ పార్టీ సేనేట‌ర్ డేవిడ్ వాన్ త‌న‌ను వేధించిన‌ట్లు ఆమె ఆరోపించారు. కానీ వాన్ మాత్రం ఆ ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు.

Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement